గుత్తేదారులకు అ’ధనం’ చెల్లించేస్తున్నారు -కత్తిరింపు

జనాన్ని విభజన రందిలో ముంచేసిన రాష్ట్ర పాలకులు తమ కార్యాల్ని నిర్విఘ్నంగా చక్కబెట్టుకుంటున్నారు. ఇ.పి.సి ఒప్పందాలకు విరుద్ధంగా జలయజ్ఞం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని పెరిగిన ధరల పేరుతో అదనంగా చెల్లించడానికి సి.ఎం, ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసేశారు. కనీసం 20,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గుత్తేదారుల పరం చేసే ఈ బృహత్కార్యాన్ని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ప్రచురించింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జనవరి 27 తేదీన సమావేశం జరగనుందని పత్రిక…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లిద్దాం -కత్తిరింపు

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ వీరాలాపాలు వల్లిస్తూ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఒంటరి యోధుడిలా జనం ముందు నిలబడ్డ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన అప్పజెప్పడానికి సిద్ధపడుతున్న వైనం ఇది. ముఖ్యమంత్రి చర్యలను ఆర్ధిక శాఖ అభ్యంతరం చెబుతున్నా వినకుండా 15 నుండి 20 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసే సమావేశం సోమవారం…