ఆయన విప్లవ ద్రోహి, ఆమె అతని భార్య కాదు -మావోయిస్టులు
ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు లొంగిపోయిన గుడ్స ఉసెండి అలియాస్ సుఖదేవ్ అలియాస్ గుముడవెల్లి వెంకట కృష్ణ ప్రసాద్ ను విప్లవ ద్రోహి గా సి.పి.ఐ(ఎం-ఎల్-మావోయిస్టు) పార్టీ ప్రకటించింది. పార్టీతో ఆయనకు సైద్ధాంతీక విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఒట్టిదే అని పార్టీ తెలిపింది. నైతికంగా దిగజారిన సుఖదేవ్ విప్లవ ద్రోహిగా మారి పోలీసులకు లొంగిపోయాడు తప్ప రాజకీయ విభేదాల వల్ల కాదని తెలిపింది. ఆయన భార్య పార్టీలోనే కొనసాగుతున్నారని, బైటికి వెళ్ళేటప్పుడు కూడా వేరే మహిళను వెంటపెట్టుకుని వెళ్ళి…
