నీతికి కట్టుబడ్డ పోలీసు అధికార్లపై సి.ఎం మోడి కక్ష సాధింపు!
గోధ్రా రైలు దుర్ఘటనను అడ్డు పెట్టుకుని గుజారాత్ లో ముస్లింలపై నెలరోజులకు పైగా నరమేధాన్ని సాగించిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఇప్పుడు, తాను సాగించిన ఘోర కృత్యాలకు సాక్ష్యాలను విచారణా కమిషన్ కు అందిస్తున్నందుకు పోలీసు అధికారులను శిక్షించడానికి నిస్సిగ్గుగా తెగబడుతున్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ముస్లింల మారణకాండకు స్వయంగా ఆదేశాలిచ్చాడనీ, అ ఆదేశాలిచ్చిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నాననీ అయినా తన స్టేట్ మెంట్ ను విచారణ కమిషన్ రికార్డు చేయడం లేదని సుప్రీం…