గుజరాత్ లోకాయుక్త: మోడికి ఓటమి, గవర్నర్ కి మొట్టికాయ

కోర్టుల్లో ఓటమి పరంపరను నరేంద్ర మోడీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్ గవర్నర్ నియమించిన లోకాయుక్తకు తన ఆమోదం లేనందున నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన మోడి అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్ర లోకాయుక్త పదవిని ఖాళీగా అట్టిపెట్టిన నీతివంతమయిన ముఖ్యమంత్రి మోడి గవర్నర్ చొరవను హర్షించే కనీసనీతిని ప్రదర్శించలేకపోయాడు. తనను తాను అజేయుడుగా భావించుకునే అపోహనుండి మోడీ బైటికి రావాలని గుజరాత్ హైకోర్టు చేత అత్యంత అవమానకరంగా అభిశంసన…

‘లోకాయుక్త’పై సుప్రీంకి మోడి ప్రభుత్వం

గుజరాత్ రాష్ట్ర లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని త్వరలో సుప్రీం కోర్టు తలుపు తడతామని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గుజరాత్ హై కోర్టు తన మెజారిటీ తీర్పు ద్వారా లోకా యుక్త నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. గుజరాత్ గవర్నర్ కమ్లా బేనివాల్ గత సంవత్సరం ఆగష్టులో…

గుజరాత్ కోర్టులో ‘మోడి’కి మొట్టికాయ

గుజరాత్ లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మరొక ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ పూనుకుని, స్వతంత్రంగా చేసిన లోకాయిక్త నియామకం చెల్లదనీ, అది రాజ్యంగ వ్యతిరేకం  అని వాదిస్తూ గజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్టు, మెజారిటీ తీర్పు ద్వారా కొట్టి వేసింది. గుజరాత్ గవర్నర్ ‘కమ్లా బెనీవాల్’ ఆగష్టు 25, 2011 తేదీన రిటైర్డ్ జస్టిస్ ఆర్.ఎ.మెహతా ను గుజరాత్ ‘లోకాయుక్త’ గా నియమించింది.…