గంటర్ గ్రాస్ ను ‘పర్సోనా నాన్ గ్రాటా’ గా ప్రకటించిన ఇజ్రాయెల్
ప్రఖ్యాత జర్మన్ రచయిత గంటర్ గ్రాస్ ను ఇజ్రాయెల్ ‘పర్సనా నాన్ గ్రాటా’ (ఆహ్వానించ దగని వ్యక్తి) గా ప్రకటించింది. తద్వారా తన జాత్యహంకార బుద్ధిని బహిరంగంగా చాటుకుంది. పాలస్తీనా భూములను అక్రమంగా ఆక్రమించుకుని సెటిల్ మెంట్లు నిర్మిస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాన్నీ, పశ్చిమాసియాలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉంటూ ఇరాన్ అణు విద్యుత్ కర్మాగారాలపై బాంబు దాడులు చేస్తామని ప్రకటించడాన్నీ గంటర్ గ్రాస్ తన కవిత ద్వారా విమర్శించడమే నేరంగా ఇజ్రాయెల్ పరిగణిస్తున్నది. “What Must…

