ఎఎపి అనూహ్య పరిణామక్రమం -కార్టూన్
అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్! మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని…
