మోడి రాతలపై బాధితుల ఆగ్రహం
జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు. గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం…
