బడ్జెట్ 2013-14: మాటలు సామాన్యుడికి, మూటలు కార్పొరేట్లకు

చిదంబరం బడ్జెట్ చిదంబర రహస్యాలతో నిండిపోయింది. ఆదర్శాలు వల్లించడానికే తప్ప ఆచరించడానికి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మాటలు సామాన్యుడికి మూటలు కార్పొరేట్లకు పంచి పెట్టింది. దొడ్డి దారిలో మూటల్ని దాటించి, సింహద్వారంలో ఆదర్శాల మాటలు వేలాడగట్టింది. ఆహార భద్రత చట్టం గురించి ఘనంగా చెప్పుకుని అందుకోసం ముష్టి 10 వేల కోట్లు విదిలించింది. దేశ ప్రజలకు పూర్తిస్థాయి ఆహార భద్రత కల్పించాలంటే 84,000 కోట్లు అవసరమని చెప్పిన తన మాటలు తానే ఉల్లంఘించింది.…