పెట్రోల్ ట్యాంకర్లు పట్టాలు తప్పి పేలిపోతే… -ఫోటోలు

కెనడా రాష్ట్రం క్వెబెక్ లో జులై 6 తేదీన పెట్రోలియం (క్రూడ్ ఆయిల్) తెస్తున్న రవాణా రైలు పట్టాలు తప్పి పెను విధ్వంసం సృష్టించింది. 72 ట్యాంకర్ల నిండా క్రూడాయిల్ తెస్తున్న గూడ్స్ రైలు అనూహ్య పరిస్ధితుల్లో తనంతట తాను కదిలి వేగం పుంజుకుని ఒక మలుపు దగ్గర పట్టాలు తప్పడంతో లాక్-మెగాంటిక్ అనే పట్టణం పాక్షికంగా ధ్వంసం అయింది. ట్యాంకర్లు ఒకదానిపై ఒకటి దొర్లిపడి పేలిపోవడంతో సమీపంలోని అనేక ఇళ్ళు తగలబడి పోయాయి. ఆరు వేల…