మంత్రివర్గం పొందిక మార్కెట్లకు నచ్చలేదుట!

నరేంద్ర మోడి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆగమనంతో మురిసిపోయిన విదేశీ (and hence స్వదేశీ) కంపెనీలు మంత్రి వర్గ నియామకాలు చూసి జావగారిపోయాయి. మార్కెట్ లకు ఈ మంత్రివర్గ పొందిక నచ్చలేదని మార్కెట్ విశ్లేషణ సంస్ధలు తేల్చిపారేశాయి. ఏనుగు మీద అదేదో ముతక సామెత చెప్పినట్లు అయిందే అని మార్కెట్లు వాపోతున్నాయిట. స్విట్జర్లాండ్ కి చెందిన బహుళజాతి ఆర్ధిక, ద్రవ్య సేవల సంస్ధ క్రెడిట్ సుసి, రాయిటర్స్ వార్తా సంస్ధ నిర్వహించే ‘మార్కెట్ ఐ’ శీర్షికలు సంయుక్తంగా…