‘బ్యాట్ మేన్’ రెక్కలు కత్తిరించిన చైనా పోలీసు గూండాలు

చైనాలో ‘పోలీసులు’ అనబడే గూండాలు ‘బ్యాట్ మేన్’ సినిమా హీరో రెక్కలు కత్తిరించారు. తన తాజా సినిమా ప్రచారం కోసం చైనాలో పర్యటిస్తున్న ‘బ్యాట్ మేన్’ హీరో క్రిస్టియన్ బేల్, ఒక చైనా న్యాయవాద కార్యకర్తను కలవడానికి చేసిన ప్రయత్నాలను స్ధానిక పోలీసులు వమ్ము చేసారు. పోలీసు నిర్భంధం నుండి విడుదలైన కార్యకర్త ఇంటివద్ద ఉన్నప్పటికీ, ఆయనను కలవడం పైన ప్రస్తుతం నిషేధమేమీ లేనప్పటికీ అతన్ని సినిమా స్టార్ కలవడానికి పోలీసులు ఇష్టపడకపోవడం విశేషం. బేల్ ను…