జులై 5 నుండి రానున్న 5 సంవత్సరాల వరకూ క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్
అంతా ఊహించినట్లే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (International Monetary Fund) “మేనేజింగ్ డైరెక్టర్” గా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకుంది. క్రిస్టిన్ లాగార్డే, ఆమె పోటీదారు అగస్టీన్ కార్స్టెన్స్ లకు అందిన మద్దతును, ఆమోదాలను (endorsements) సమీక్షించిన ఐ.ఎం.ఎఫ్ బోర్డు క్రిస్టిన్ లాగార్డే కి అధిక మద్దతు ఉన్నట్లు భావించి ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి పోటీ ఏర్పడింది. ఎమర్జింగ్ మార్కెట్…