వన్‌డే, టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ఇండియా పర్యటించనున్న పాకిస్ధాన్
ముంబై టెర్రరిస్టు దాడులతో ఇండియా, పాకిస్ధాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలను కూడా ఇండియా తెంచుకున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడిన దాయాదులు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రక్రియను క్రికెట్ దౌత్యంతో ప్రారంభించారు. ఇండియా ప్రధాని, ఇండియా, పాక్‌ల సెమీఫైనల్ మ్యాచ్ తిలకించడానికి పాక్ ప్రధానిని ఆహ్వానించగా ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ని ఆద్యంతం తిలకించి సంబంధాల మెరుగుదలకు తాము సిద్ధమని తెలిపాయి. జూన్ నెలలో…