అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…