ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని అమెరికా, ముసురుకుంటున్న డబుల్ డిప్ భయాలు

ఘనత వహించిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఆగష్టులో ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయింది. ముప్ఫై కోట్ల జనాభాలో ముప్ఫై రోజుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నికరంగా ఉద్యోగం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వానికి రక్షణ బాధ్యత, పాలన బాధ్యత తప్ప మిగిలినవి ఏవీ ఉండకూడదు. ఇతర అన్ని కార్యకలాపాలనూ మార్కెట్‌కే అప్పజెప్పాలని ప్రపంచానికి నిత్యం బోధలు చేసే కార్పొరేట్ అమెరికా ఉద్యోగాలు ఇవ్వకుండా లాభాలను మాత్రం బిలియన్ల కొద్దీ డాలర్లు ప్రకటిస్తోంది. ఉద్యోగాలివ్వని లాభాలవి. ఉద్యోగాలివ్వని వ్యాపారమది. ఉద్యోగాలివ్వని ఉత్పత్తి…