ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు

వచ్చే ఆరునెలల్లో భారత దేశంలో ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు  మరిన్ని అమలు  చేయనున్నామని ప్రధాని ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసు ప్రకటించాడు. 2014 వరకూ ‘బిగ్ టికెట్’ సంస్కరణలేవీ సాధ్యం కాదని ప్రకటించి రాజకీయ, ఆర్ధిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన కౌశిక్ బసు బి.జె.పి తో పాటు ప్రవేటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో తన గొంతు సవరించుకున్నాడు. సబ్సిడీలను తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆయన సూచించాడు. డీజెల్ ధర్లపై నియంత్రణ, రిటైల్ రంగంలో…