కోలేటరల్ మర్డర్: ఓ అమెరికా సైనికుడి పశ్చాత్తాపం
2010 ఏప్రిల్ 5 తేదీన ‘కోలేటరల్ మర్డర్’ శీర్షికతో వికీ లీక్స్ విడుదల చేసిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో ఆ దేశ పౌరులపైన అమెరికా సైనికులు సాగిస్తున్న దారుణ మారణ కాండను ‘కోలేటరల్ మర్డర్’ వీడియో కళ్లకు కట్టింది. ఒక గ్రూపుగా వీధిలో నిలబడి ఉన్న సాధారణ పౌరులను మైలున్నర దూరంలో ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ గన్ తో అమెరికా సైనికులు కాల్చి చంపిన దృశ్యాన్ని, దారినే పోతున్న…
