తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!
తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా…