గుజరాత్ లోకాయుక్త: మోడికి ఓటమి, గవర్నర్ కి మొట్టికాయ
కోర్టుల్లో ఓటమి పరంపరను నరేంద్ర మోడీ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. గుజరాత్ గవర్నర్ నియమించిన లోకాయుక్తకు తన ఆమోదం లేనందున నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టు గడప తొక్కిన మోడి అక్కడ కూడా ఓటమి చవిచూశాడు. తొమ్మిదేళ్లకు పైగా రాష్ట్ర లోకాయుక్త పదవిని ఖాళీగా అట్టిపెట్టిన నీతివంతమయిన ముఖ్యమంత్రి మోడి గవర్నర్ చొరవను హర్షించే కనీసనీతిని ప్రదర్శించలేకపోయాడు. తనను తాను అజేయుడుగా భావించుకునే అపోహనుండి మోడీ బైటికి రావాలని గుజరాత్ హైకోర్టు చేత అత్యంత అవమానకరంగా అభిశంసన…

