డి.ఎం.కె కోసం అవినీతి జడ్జిని యు.పి.ఏ పొడిగించింది -కట్జు

యు.పి.ఏ హయాంలో ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితుడయిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జు కేంద్ర ప్రభుత్వం మార్పుతో కొత్త ప్రభుత్వాన్ని కాకా పట్టే పనిలో పడ్డారా? ఎప్పుడో పదేళ్ళ నాటి జడ్జి నియామకపు అవకతవకల్ని ఆయన ఇప్పుడు తవ్వి తీస్తుండడంతో ఈ అనుమానం కలుగుతోంది. డి.ఎం.కె ఒత్తిడికి లొంగిన యు.పి.ఏ ప్రభుత్వం అవినీతి జడ్జికి మూడుసార్లు పొడిగింపు ఇచ్చిందని కట్జు తాజాగా ఆరోపించారు. పనిలో పనిగా తాజా తమిళనాడు ముఖ్యమంత్రి ఏనాడూ కోర్టు…