ఆపరేషన్ బ్లూ వైరస్: మోడి పాపులారిటీ పెరుగునదెట్టిదనిన…

సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లను రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వినియోగించేది ఎవరంటే టక్కున వినిపించే పేరు, నరేంద్ర మోడి. ప్రత్యర్ధులకు ఒకింత ఈర్ష్య కలిగించే ఈ ఫీట్ మోడి ఎలా సాధించారన్నది ఇప్పటిదాకా ఒక మిస్టరీ. ఆ మిస్టరీని కోబ్రా పోస్ట్ న్యూస్ పోర్టల్ ఛేదించింది. అనేక ఐ.టి కంపెనీలు డబ్బు తిని మోడి తదితరులకు కృత్రిమ ఫాలోయర్స్ ను సృష్టిస్తూ ఆయన పాపులారిటీ కృత్రిమంగా పెరిగేలా చేస్తున్నారని కోబ్రా పోస్ట్ నిర్వహించిన ‘ఆపరేషన్…

22 బ్యాంకులకు 50 కోట్ల జరిమానా విధించిన ఆర్.బి.ఐ

సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా…

స్టింగ్ ఆపరేషన్: తలలు తెగి పడుతున్నాయ్

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఫలితాలు చూపిస్తోంది. బలి పశువుల తలలు తెగిపడుతున్నాయి. సమస్య మూలాలను కదిలించడానికి బదులు జీతగాళ్లను బలి తీసుకునే కార్యక్రమం మొదలయింది. అందులో భాగంగా మనీ లాండరింగ్ కి అంగీకరిస్తున్నట్లు రహస్య కెమెరాల సాక్షిగా దొరికిపోయిన అధికారులను ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సస్పెండ్ చేసింది. బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయ్యేవరకు వారు సస్పెన్షన్ లో ఉంటారని సదరు బ్యాంకు తెలియజేసింది. రెండు వారాల లోపు విచారణ పూర్తవుతుందని బ్యాంకు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ తెలియజేసింది.…