కోదండరాం నోట ‘2014’ పాట

టి.ఆర్.ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యిందని కోదండరాం గాని ప్రకటన ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. అంతేకాదు. కోదండరాం గారు టి.ఆర్.ఎస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన ప్రకటన స్పష్టం చేసింది. “2014 సంవత్సరం లోపల తెలంగాణ సాధించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం” అని ప్రొఫెసర్ కోదండరాం గారు మంగళవారం ప్రకటించారు. ఆయన ఇంటెగ్రిటీ పట్ల ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నవారికి ఈ ప్రకటన కళ్ళు తెరిపించినట్లయ్యింది. ‘2014 లోపల తెలంగాణ సాధిద్దాం’ అని…