కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతం మిలియన్ మార్చ్ విధ్వంసానికి కారణాలు
తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలియడంతోనే టాంక్ బండ్ పై ఉన్న ఆందోళనకారులు ఆయన విడుదల డిమాండ్ చేస్తూ విగ్రహాల ధ్వంసం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ తర్వాత కోదండరాంను విడుదల చేశాక “కోదండరాంను విడుదల చేశార”న్న సమాచారంతో కే.సి.ఆర్ హడావుడిగా టాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పటికీ కే.సి.ఆర్ మాటకూడా వినకుండా విగ్రహలు ధ్వంసం చేయడం వారు కొనసాగించారని “ది హిందూ” పత్రిక తెలియజేసింది. సంఘటనల క్రమం ఐదువందల మంది ఐ.ఎఫ్.టి.యు…