రాష్ట్రాలకు కేంద్రం 81 వేల కోట్ల ఎగవేత!
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సిఏజి) చేసిన పరిశోధనలో ఈ వాస్తవం వెల్లడి అయింది. ఈ పాపంలో కాంగ్రెస్, బిజేపిలు రెండూ భాగం పంచుకోగా కాంగ్రెస్ కంటే బిజేపి నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని సిఏజి గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1996-97, 1997-98, 2006-07, 2007-08, 2014-15 సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు ఇవ్వవలసిన మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని కేంద్రం పంపిణీ చేసిందని సిఏజి…