కై పొ చె! కాంగ్రెస్, బి.జె.పి ల గాలిపటాలాట -కార్టూన్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో…