మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…