ఇండియా ప్రధానికి బ్రిటన్ ప్రధాని వాణిజ్య పాఠాలు
బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ భారత దేశ ప్రధాన మంత్రికి విదేశీ వాణిజ్యం, దానికి సంబంధించిన విధాన నిర్ణయాలపై పాఠాలు నేర్పటానికి పూనుకున్నాడు. ఇద్దరి మధ్య వేలకొద్దీ కిలోమీటర్ల దూరం ఉండడంతో కరెస్పాండెన్స్ కోర్సును కామెరూన్ పాఠాలు చెప్పడానికి ఎన్నుకున్నాడు. బ్రిటన్, ఇండియా లకు చెందిన కంపెనీల మధ్య ఇండియాలో ఉన్న “కైర్న్ ఇండియా” కంపెనీ అమ్మటానికి ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో భారత ప్రభుత్వ రంగ సంస్ధకు వాటాలుండడంతో ఇక్కడి ప్రభుత్వ అనుమతి…