మోడి పచ్చి అబద్ధాల కోరు -గుజరాత్ బి.జె.పి నాయకుడు కేశూభాయ్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నిజ స్వరూపాన్ని ఆయన పార్టీ నాయకులే విప్పి చూపుతున్నారు. మోడి చెబుతున్న అభివృద్ధి పారిశ్రామికవేత్తలదే తప్ప ప్రజలది కాదన్న వాస్తవాన్ని వెల్లడిస్తున్నారు. అబద్ధాలు చెప్పడాన్ని మోడీ గుత్తకు తీసుకున్నాడని, ఆయన సద్భావన మిషన్ పెద్ద మోసమనీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బి.జె.పి నాయకుడు కేశూభాయ్ పటేల్ అసలు వాస్తవాన్ని వెల్లడించాడు. తద్వారా మోడీ కేంద్రంగా ఉబ్బిపోతున్న గాలి బుడగను ‘టప్పున’ బద్దలు కొట్టాడు.  “ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుదారి పట్టించడాన్ని ఒక…