‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు
అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…