ఐరిష్ అబార్షన్ చట్టం: డాక్టర్లా లేక మత బోధకులా?
‘మాది కేధలిక్కుల దేశం’ అని మూర్ఖంగా వాదించి భారతీయ డెంటిస్టు సవితా హలప్పనవార్ ప్రాణాలు బలిగొన్న ఐర్లండు డాక్టర్లు ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తలపెట్టిన బలహీన ‘అబార్షన్ చట్టాన్ని’ కూడా వ్యతిరేకిస్తున్నారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు తీవ్రమైన కేసుల్లో అబార్షన్ కు అనుమతించేందుకు చట్టంలో కల్పించిన అవకాశాన్ని ఐరిష్ మెడికల్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎం.ఒ) సమావేశం తిరస్కరించింది. ఇంకా ఘోరం ఏమిటంటే అత్యాచారం, స్వకుటుంబ సంపర్కం తదితర ప్రత్యేక పరిస్ధితుల ద్వారా సంభవించిన గర్భాన్ని తొలగించడానికి కూడా…
