మళ్ళీ వార్తల్లో కె.పి.ఎం.జి, 5సం.గా కదలని లైంగిక వేధింపుల కేసు
ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేటు అకౌంటింగ్ కంపెనీ కె.పి.ఎం.జి (క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గార్దెలర్ – Klynveld Peat Marwick Goerdeler) మరోసారి వార్తలకెక్కింది ఒక మహిళ ఉద్యోగి పైన ఆమె సహ ఉద్యోగులే లైంగికంగా వేధింపులకు పాల్పడిన కేసులోనే ఈసారి కూడా సదరు కంపెనీ వార్తల్లో నిలిచింది. దాదాపు ఐదేళ్ల క్రితం నాటి ఈ కేసు పోలీసు, న్యాయ, పరిపాలనా వ్యవస్ధలన్నీ ఏ విధంగా ధనికుల సావాసం చేస్తున్నాయో వెల్లడిస్తున్నది. బహుశా ‘ధనికుల సావాసం’ అనడం సమస్యలోని…