లడ్డు గొడవ జగన్ అరెస్టు కోసమా?
తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపిన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ‘గాలివానగా మారిపోయింది’ అని కూడా అనవచ్చునేమో? ఒక సాధారణ తినుబండారానికి దైవత్వం ఆపాదించి భగవంతుడు స్వయంగా ఆశీర్వదించి ప్రసాదించిన ప్రసాదంగా మార్చివేశాక, ఆ తినుబండారం కేంద్రంగా ఇక ఎన్ని రాజకీయాలు చేయవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 18 తేదీన అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా…
