కులం వికృత రూపాన్ని చూడండి!
సో-కాల్డ్ అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళకి దళితులు కుల అణచివేత గురించి మాట్లాడటం అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకేం తక్కువయిందట అని ప్రశ్నిస్తుంటారు. ‘నువ్వు కడ జాతి వాడివి’ అని చెప్పకుండానే చూపుల్తో చెప్పేసే చూపులని భరించడం ఎంత కష్టమో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు. చిన్న కులాల పట్ల వాళ్ళ తేలిక భావాల్ని పెద్ద విషయం కాదన్నట్లు తేలికగా తేల్చేస్తారు. మీరు ప్రభుత్వానికి దత్త పుత్రులు అంటూ ఒక వ్యంగ్యాన్ని మొఖం మీద విసిరి కొడతారు.…

