వాళ్ళని ఓడించేందుకే ప్రియుడి శవాన్ని పెళ్లి చేసుకున్నాను -సాహస ప్రేమిక
తమిళనాడులో కుల పెద్దల ఆధిపత్యానికి లొంగిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు ఇలవరసన్ తో నివసించేది లేదని కోర్టు మెట్లపై నిలబడి ప్రకటించి భర్తను ఆత్మహత్య వైపుకి నెట్టిన యువతి పిరికితనాన్ని చూశాం. మిర్యాలగూడ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ ని తన తండ్రే కిరాయి గూండాలతో కిరాతకంగా హత్య చేయించాక పుట్టింటితో తెగతెంపులు చేసుకుని భర్త కుటుంబంతోనే జీవితం గడుపుతున్న అమృత ప్రేమ ధైర్యాన్ని చూస్తున్నాం. మహారాష్ట్ర, నాందేడ్ లో తన ప్రేమికుడిని…


