“కులములో ఏముందిరా?” పాత పాట, మంచి పాట!
పాత తెలుగు సినిమా పాటలపై తెలుగు వారి మమకారం శాశ్వతమేనేమో! సందర్భశుద్ధితో రాయడం, సినిమా కధకు తగిన పాటలు కావడం, సందర్భాలకు తగిన విధంగా రాసిన సాహిత్యానికి ఆ తర్వాత మాత్రమే సంగీతం సమకూర్చడం… ఈ కారణాల వలన అప్పటి పాటలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో, గుండెల్లో, నాలుకలపైనా తిష్టవేయగలిగాయి. మరీ ముఖ్యంగా సమాజంలోని వాస్తవ స్ధితిగతులతో సినిమా కధలకు దగ్గరి సంబంధం ఉండడం, ఆయా సినిమా కధల్లోని వివిధ పాత్రలతో తమ నిజ జీవితాలనూ, జీవిత…