కూడంకుళం: ‘ఇదింతకరై’ లో అప్రకటిత ఎమర్జెన్సీ -నిజ నిర్ధారణ నివేదిక

కూడంకుళంలో మత్స్యకారుల శాంతియుత నిరసనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్రాల సోకాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రూర నిర్బంధ విధానాలు స్వతంత్ర పరిశీలకుల ద్వారా మరోసారి వెల్లడైనాయి. కూడంకుళం అణు కర్మాగారంలో అణు ఇంధనం నింపడానికి వ్యతిరేకంగా సెప్టెంబరు 10 తేదీన సముద్రతీర గ్రామ ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు అమానుష నిర్బంధాన్ని ప్రయోగించారనీ పిల్లలు, స్త్రీలపై కూడా బలప్రయోగం చేశారనీ, మైనర్ పిల్లలపై దేశ ద్రోహం నేరం మోపి బాలల ఖైదుకి పంపారని నిజనిర్ధారణ కమిటీ…

కూడంకుళం: ఆగని నిరసనలు, ట్యుటికోరిన్ పోర్టు సీజ్

కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా లక్షలాది గ్రామ ప్రజలు సాగిస్తున్న పోరాటం కొనసాగుతోంది. ప్రజల భయాలు, ఆందోళనలు పట్టించుకోకుండా కూడంకుళం అణు రియాక్టర్ లో యురేనియం ఇంధన కడ్డీలను నింపడం ప్రారంభం అయిన నేపధ్యంలో మత్స్యకారులు వెయ్యికి పైగా పడవలతో ట్యుటికోరిన్ పోర్టును శనివారం దిగ్బంధించారు. తమిళనాడు తీరం అంతటా మత్స్యకారులు ఆందోళన చేయాలని PMANE (Peoples Movement Aganist Nuclear Energy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ నిరసనను చేపట్టారు. మరో వైపు అణు…

భారత విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ తీర్చేనా? -కార్టూన్

విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు భారత దేశం చేసే ప్రయాణంలో అణు విద్యుత్ కర్మాగారాలు సహాయపడతాయా?  లేక ఆటంకం కలిగిస్తాయా? ‘ది హిందూ’ కార్టూనిస్టు ‘కేశవ్’ కాసిన్ని గీతలు గీసి, మరి కాసిన్ని రంగులు అద్ది వివరించారు. అమెరికన్ అణు పరిశ్రమ వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికే భారత్-అమెరికాల మధ్య ‘అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామని అణు నియంత్రణ సంస్ధ ఎ.ఇ.ఆర్.బి మాజీ అధిపతి గోపాల కృష్ణన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టాడు. గతంలో అణు…

అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు

కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’…

కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం

కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.…

కూడంకుళం: ప్రజల భద్రతే అంతిమం -సుప్రీం కోర్టు

కూడంకుళం అణు కర్మాగారం (ఫొటో: ది హిందూ) తమిళనాడు కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు నుండి ఒకింత మద్దతు లభించీంది. ఇంధనం నింపడంపై స్టే విధించడానికి నిరాకరించినప్పటికీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. కర్మాగారం చుట్టూ ఉన్న ప్రజల భద్రతే అంతిమమని వ్యాఖ్యానించింది. ఇంధనం నింపినప్పటికీ రెండు నెలల వరకూ కర్మాగారాన్ని ప్రారంభించబోమన్న కేంద్రం హామీపై నమ్మకం ఉంచింది. మద్రాస్ హై కోర్టు…

కూడంకుళం: ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కేనా? -అణు బోర్డు మాజీ చైర్మన్

కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై కూడంకుళం ప్రజల వీరోచిత పోరాటం

పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ…

ఫుకుషిమా సముద్ర చేపల్లో భారీ రేడియేషన్

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద సముద్ర చేపల్లో భారీ స్ధాయి రేడియేషన్ కనుగొన్నట్లు ‘టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ (టెప్కో) తెలిపింది. సముద్ర తీరానికి 20 కి.మీ దూరం లోపల పట్టిన చేపల్లో రికార్డు స్ధాయిలో అణుధార్మిక సీసియం రేడియేషన్ కనుగొన్నామని టెప్కో ప్రకటించిందని ‘ది హిందూ’ తెలిపింది. ప్రమాదానికి గురయిన ఫుకుషిమా అణు రియాక్టర్ల నుండి కలుషిత నీటిని సముద్రంలో కలిపేస్తున్న నేపధ్యంలో ఇటీవలివరకూ ఫుకుషిమా చుట్టు పక్కల చేపలు పట్టడం పై అప్రకటిత నిషేధం…

కుదంకుళం: అణు పరిహార చట్ట ఉల్లంఘనకు అణు విద్యుత్ శాఖ ప్రయత్నాలు?

కుదంకుళం అణు కర్మాగారం పట్ల స్ధానిక ప్రజల భయాలు ఎంత నిజమో తెలిసి వస్తోంది. విదేశీ అణు కంపెనీల ప్రయోజనాలే తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వంలో విలువలేదని తెలిపే సంఘటన వెల్లడయింది. 2010 లో భారత ప్రభుత్వం చేసిన ‘అణు ప్రమాద పరిహార’ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సరైన అణు పరికరాలను సరఫరా చేయకపోవడం వల్ల ఏర్పడే అణు ప్రమాదాలకు నష్టపరిహారాన్ని పరికరాల సరఫరాదారు కంపెనీలు కూడా భరించవలసి ఉంటుంది. తమిళనాడులోని కుదంకుళంలో రష్యా…

భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

తమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు…

కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

కుదంకుళం అణు కర్మాగారం, ప్రధాన మంత్రిపై పరువు నష్టం దావా

రష్యా సహకారంతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై పోరాటం చేస్తున్న ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలకు అమెరికా, స్కాండినేవియా దేశాల నుండి డబ్బు ముడుతోందంటూ వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ‘పరువు నష్టం’ దావా వేయడానికి ఉద్యమ నాయకుడు ఉదయ కుమార్ సిద్ధమవుతున్నాడు. తమకు ఏ దేశం నుండీ నిధులు అందడం లేదనీ, ఆమేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయనీ ఉదయకుమార్ ఆరోపిస్తున్నాడు. అణు విద్యుత్…