అమెరికా: మా ఇంటికొస్తూ ఏం తెస్తావ్? మీ ఇంటికొస్తే ఏమిస్తావ్?
అమెరికా ద్వంద్వ విధానాల గురించి అనేకానేక పుస్తకాలు, విమర్శలు, కధలు, వార్తా కధనాలు వచ్చాయ్, వస్తున్నాయ్, వస్తూనే ఉంటాయ్. మూడో ప్రపంచ దేశాలతో అమెరికాది ఎలాగూ పెత్తందారీ వైఖరే. పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రం అయ్యేకొద్దీ అమెరికా తన అనుంగు మిత్రులతో కూడా ఇదే తీరులో వ్యవహరిస్తోంది. ఇండియా లాంటి దేశాలపై వినాశకర అణు ఒప్పందాన్ని రుద్దిన అమెరికా కెనడాకు చమురు సరఫరా చేసే పైప్ లైన్ నిర్మాణానికి మాత్రం గ్లోబల్ వార్మింగ్ కారణంగా చూపుతోంది. ఉత్తర అమెరికా…
