ఐ.పి.ఎల్: పిచ్ చూసి చెబుతాం… ఎవరు ఆడతారో -కార్టూన్
పిచ్ ను బట్టి ఏయే దేశాల వాళ్లు ఆడవలసి ఉంటుందో కెప్టెన్ నిర్ణయించ వలసిన రోజులు వచ్చేసాయి. ఏ దేశం వాళ్లు ఆడగూడదో చెప్పాక, ఏయే దేశాల వాళ్లు ఆడతారో కూడా చెప్పాలి కదా! ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర ఆ విషయమే చెబుతున్నారు, ఈ కార్టూన్ ద్వారా. లేకపోతే, ఐ.పి.ఎల్ మ్యాచుల్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఆడగూడదని రాజకీయ నాయకులు నిర్ణయించడం ఎమిటి, విడ్డూరం కాకపోతే. అది కూడా ఒక రాష్ట్రంలో ఆడే మ్యాచ్…