ఇండియాలో కాల్ సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికా కాంగ్రెస్ లో చట్టం
ఇండియూతో సహా అనేక మూడో ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధించే అమెరికా, ఆ సిద్ధాంతాలు తమకు నష్టకరంగా పరిణమిస్తే తానే వాటిని అనుసరించనని చాటి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను దోచుకోవడానికీ, అక్కడి మార్కెట్లను కొల్లగొట్టడానికి సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దిన అమెరికా తన ప్రయోజనాల విషయానికి వస్తే అవే విధానాలను తాను నిస్సందేహంగా తిరస్కరిస్తానని మరోసారి నిరూపించుకుంది. ఎండు చేపలు తినకూడనిది ఊరివాళ్ళే గానీ తాను కాదని తన…