బ్రిటన్ లో కేరళ నర్సు జసింత ఆత్మహత్య, విశ్లేషణ
డిసెంబరు 7 వ తేదీన భారతీయ నర్సు జసింత సల్దానా బ్రిటన్ లో ఆత్మహత్యకు పాల్పడింది. బ్రిటిష్ రాణిగారి కొడుకు గారి కోడలుగారు గర్భం ధరించి వేవిళ్లతో బాధపడుతున్న నేపధ్యంలో ఆమెకు సపర్యలు చేస్తున్న క్రమంలో జసింత సల్దానా అన్యాయంగా బలవన్మరణానికి గురయింది. సిగ్గూ, ఎగ్గూ లేని అనైతిక మీడియా ప్రమాణాలను అభివృద్ధి చేసుకున్న పశ్చిమ మీడియా విసిరిన గాలానికి చిక్కిన జసింత అర్ధాంతరంగా తనువు చాలించింది. తన చావుద్వారా బ్రిటిష్ రాచకుటుంబం చుట్టూ కమ్మిన మాయపొరను…