హిందు పండగలతో పోలిన కేధలిక్ కార్నివాల్ -ఫోటోలు

భారత దేశంలో పండగలు సాంస్కృతిక కలయికలకు వేదికలుగా నిలుస్తాయి. శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం, వినాయక చవితి సందర్భంగా వినాయక నిమజ్జనం, దీపావళి రోజున బాణసంచా పేలుళ్లు, సంక్రాంతి సంబరాల్లో పంటలు, అల్లుళ్ళ సందడి మొదలయినవన్నీ భారత దేశంలో సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండగలు కాకుండా వివిధ నదుల వద్ద జరిగే పుష్కరాలు, కుంభమేళాల సంగతి చెప్పనే అవసరం లేదు. రోజువారీ శ్రామిక జీవితం నుండి ఆటవిడుపుగానూ, పూర్వీకులు సాధించిన విజయాలను సెలెబ్రేట్ చేసుకునే రోజులుగానూ…