అన్నాకి గురువైనందుకు మహాత్మాగాంధి సైతం జైల్లోకే -కార్టూన్

కేంద్ర ప్రభుత్వం అన్నా హజారే అంటేనే ఉలిక్కిపడుతోంది. దీక్ష మొదలు కాక ముందే అన్నా బృందాన్ని అరెస్టు చేసి చేతులు కాల్చుకుంది. నాలిక్కరుచుకుని విడుదల చేయబోయి అక్కడా దెబ్బతిన్నది. మరోపక్క అన్నా హజారే తన అరెస్టునే ఆందోలనకు అనువుగా మార్చుకోగలిగాడు. అన్నా బృందం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఈ కార్టూన్‌ని భారతీయ కార్టూనిస్టు మంజుల్ గీసింది. – “అన్నా హజారేకి ఆయనే గురువని ప్రభుత్వానికి తెలిసిందట మరి!” —

అవినీతి వ్యతిరేక ఉద్యమం ముందు పార్లమెంటు అధికారం ఏపాటిది? -కార్టూన్

అన్నా హజారే, ఆయన మిత్ర బృందంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ చట్టాలు చేసే హక్కుని తమ చేతుల్లోకి లాక్కుంటున్నారని. ఎంతో కష్టపడి ప్రజల ఆమోదాని సంపాదించి పార్లమెంటులోకి వస్తే, ఆ పార్లమెంటు అధికారం ముందు ఓ ముసలోడు ఎదురొడ్డి నిలవడం ఏమిటన్నది వారి ప్రశ్న. అన్నా హజారే వెనుక జనం, అవినీతిపై వారి వ్యతిరేకతా బలంగా ఉండబట్టి గానీ లేదంటే బాబా రాందేవ్ కి పట్టిన గతే ఆయనకీ పట్టి ఉండేది. పార్లమెంటు సభ్యులు తమకు ప్రజలు…

బారక్ ఒబామా: నాడు, నేడు -కార్టూన్

2008 లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల కాలానికి ఒక్కసారి వెళితే… ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టారు. అర్ధం లేని రెండు దురాక్రమణ యుద్ధాలతో అమెరికాపై రుణ భారం పెంచుతూ పోయిన జార్జి బుష్ పాలన పట్ల అమెరికన్లు విసిగిపోయి ఉన్నారు. తనను గెలిపిస్తే ఆఫ్ఘన్, ఇరాక్ లనుండి సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని నమ్మ బలికాడు. ముస్లిం ప్రపంచంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటానన్నాడు. ఇరాన్, రష్యా లతో కొత్త రకం…

స్పెయిన్ రుణ సంక్షోభం, పొదుపు చర్యలకు బలౌతున్న జనం -కార్టూన్

యూరో జోన్ లో (యూరోను కరెన్సీగా అంగీకరించిన యూరప్ దేశాలు) రుణ సంక్షోభంలో ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరుతో అక్కడి ప్రభుత్వం ప్రజలపై పొదుపు బడ్జెట్ నీ, పొదుపు ఆర్ధిక విధానాలనీ ప్రజలపై రుద్ధుతోంది. ఇప్పటికే సగం చచ్చి ఉన్న కార్మికులు, ఉద్యోగులపై మరిన్ని కోతలు, రద్దులు ప్రకటించడంతో వారి కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. బ్యాంకులు, కంపెనీలకు పన్నుల రాయితీలు కొనసాగిస్తూ, వీలతై మరిన్ని రాయితీలిస్తూ, ప్రజలపైన పన్నులు బాదుతున్నారు. ఇది…

ధనికుడి ఆర్ధిక సంక్షోభం, దరిద్రుడి ఆకలి సంక్షోభం -కార్టూన్

ప్రపంచం ఇప్పుడు సంక్షోభాలతో నిండిపోయింది. ఏ పత్రిక చూసినా, ఏ ఛానెల్ చూసినా అమెరికా రుణ సంక్షోభం, యూరప్ రుణ సంక్షోభం, రుణ సంక్షోభం ఆసియాను తాకుతుందా? చైనా, ఇండియాల పరిస్ధితి ఏమిటి? జర్మనీ, ఫ్రాన్సులు యూరప్‌ని ఒడ్డుని చేరుస్తాయా? ఈ ప్రశ్నలే ఎల్లెడలా! వీటన్నింటికీ అతీతంగా సర్వకాల సర్వావస్ధల యందు కూడా ఆకలి సంక్షోభం లో ఉన్నవారి సంగతి ఎవరికీ పట్టదు, అప్పుడప్పుడూ వచ్చే పరిశోధనాత్మక వ్యాసాలు తప్ప. 2008 ఆర్ధిక సంక్షోభం రాగానే ప్రపంచ…

యూరప్ రుణ సంక్షోభంలో తదుపరి సమిధలు ఇటలీ, స్పెయిన్? -కార్టూన్

అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు.…

అమెరికా రుణ సంక్షోభానికి తాత్కాలిక మాట్లు -కార్టూన్

అమెరికా రుణ పరిమితిని $2.1 పెంచడానికీ, బడ్జెట్ లోటు $2.1 ట్రిలియన్ తగ్గించడానికి రిపబ్లికన్లు, డెమొక్రట్లు కుదుర్చుకున్న ఒప్పందం సంక్షోభంలో ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు తాత్కాలికంగా మాట్లు వేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం దానివలన రాదు. అమెరికా ప్రజల మౌలిక సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, బడా కంపెనీల దోపిడి, వేతనాల స్తంభన… మొదలైన సమస్యలను పరిష్కరించకుండా,ఆర్ధిక వ్యవస్ధలొని వివిధ ప్రధాన అంగాల్లో తాత్కాలికంగా మాట్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించడం అవివేకం. అది…

లిబియా తిరుగుబాటుదారుల్లో వెల్లివిరుస్తున్న ఐకమత్యం -కార్టూన్

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల ప్రాపకంతో లిబియాలో కొనసాగుతున్న తిరుగుబాటుదారుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తున్నట్లు అక్కడి నుండి వస్తన్న వార్తలు తెలుపుతున్నాయి. యుద్ధంలో ఫ్రంట్ లైన్‌ లో పాల్గొంటున్న కమేండర్‌ను వెనక్కి పిలిపించి మరీ కాల్చి చంపేటంత ఐకమత్యం వారిలో అభివృద్ధి చెందింది. జనరల్ అబ్దెల్ ఫతా యోనెస్, తిరుగుబాటు ప్రారంభంలొ గడ్డాఫీని వదిలి తిరుగుబాటు శిబిరంలోకి మారాడు. ఆయన రహస్యంగా గడ్డాఫీ బలగాలకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో లిబియా తిరుగుబాటుదారుల్లోని ఒక సెక్షన్, ఆగస్ఠు ప్రారంభంలో ఆయనని…

ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్

రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…

అమెరికా, ఇరాన్… పశ్చిమాసియాలో గెలుపెవరిది?

పశ్చిమాసియాలో అరబ్ విప్లవాల నేపధ్యంలో ప్రత్యక్షంగా కనపడని పరోక్ష యుద్ధం ఒకటి సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరో వైపు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పరోక్ష యుద్ధంలో గెలవడానికి అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుంటే ఇరాన్ మాత్రం నింపాదిగా జరిగేది చూస్తూ ఉంది. ఇరాన్ విరోధులు ఇరాన్ ప్రమేయం లేకుండానే ప్రజల తిరుగుబాట్లలో నేలకొరుగుతుంటే ఇరాన్ చేయవలసిందేముంటుంది గనక? ఈజిప్టులో ముబారక్ శకం ముగిసింది. ఇరాన్ విరోధి సౌదీ అరేబియా మిత్రులు బహ్రెయిన్, యెమెన్ లు…