సృజనాత్మకతపై నిర్హేతుక కట్టుబాట్లు -ది హిందు ఎడిట్

(హిందూత్వ సంస్ధల రాజకీయ పలుకుబడి పెరిగిన ఫలితంగా వారి సంకుచిత సాంస్కృతిక భావజాలం సమాచార, ప్రసార శాఖలోకి చొరబడి సమాజ ఆలోచనా రీతిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని సూచించే ఈ సంపాదకీయం ఈ రోజు, డిసెంబర్ 8, ది హిందు పత్రికలో ప్రచురించబడింది. -విశేఖర్) ********* “అశ్లీల’ అంశాలను, ‘మహిళలను కించపరిచే” కార్యక్రమాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ‘కామెడీ సెంట్రల్’ టెలివిజన్ ఛానెల్ ప్రసారాలను 10 రోజుల పాటు నిషేధిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ…