MH370: ప్రమాదానికి కారణం కాక్ పిట్ ఎమర్జెన్సీ?

దర్యాప్తు అధికారులు వెల్లడించిన కొన్ని అంశాలు MH370 అదృశ్యంపై కొత్త వెలుగును ప్రసరింప జేశాయి. ఈ అంశాలు మలేషియా అధికారుల దృష్టిలో మొదటి నుండీ ఉన్నప్పటికీ ప్రపంచానికి తెలియడం ఇదే తొలిసారి. డెయిలీ మెయిల్ పత్రిక ఈ అంశాలను వెల్లడి చేసింది. తనను తాను గుర్తించడానికి నిరాకరించిన మలేషియా దర్యాప్తు అధికారిని ఉటంకించిన డెయిలీ మెయిల్ (సి.ఎన్.ఎన్ ద్వారా), విమానం 35,000 అడుగుల ఎత్తు నుండి ఒక్కసారిగా 12,000 అడుగుల ఎత్తుకు దిగి వచ్చిందని తెలిపింది. ఏవియేషన్…