సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత
(రచన: అవ్వారి నాగరాజు) ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి అంటోంది ప్రేమించవేం ప్రియా ? “సమైక్యం” గా ఉందామని ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక- చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి…
