కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ చిరస్మరణీయుడు -అద్భుతమైన కవిత
వాడ్ని గిరజాల జుట్టోడని వాళ్ళు తెగ ఆడిపోసుకున్నారు, అది తమ బర్బర ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ సంపద అన్నాడు. సర్వ సేనానిగా ఉండి ఆఫ్ట్రాల్ కల్నల్ బిరుదేమిటన్నారు, జనరల్ కంటే కల్నలే సిపాయిల్లో మమేకతకి సాధనమన్నాడు. రాజై రాజ దుస్తులొదిలి సైనిక దుస్తుల ధారణేమిటని వెక్కిరించారు, అది ‘ప్రపంచ పోలీసు’ పై సాయుధ ప్రతిఘటనా సంకేతమన్నాడు. విదేశీ సభలకీ ఒంటె, టెంటు, మందీ, మార్బలాలు ఆటవికమన్నారు, ఎడారి మూలవాసుల బిడారి వృత్తిపట్ల…