కృష్ణ నాయకత్వంలో ఎంక్వైరీ కమిటీ వేసుకోండి -ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధానికి యెడ్యూరప్ప సవాల్
ఇద్దరు వెధవలు కొట్లాడుకుంటూ తిట్టుకుంటున్నారట. “నువ్వు వెధవాయ్‌వి” అని ఒకడంటే, “నాకంటె నువు పెద్ద వెధవాయ్‌వి కదా” అని మరొకడు. చూసేవారికీ, వినేవారికీ ఇద్దరూ వెధవాయ్‌లేనని అర్ధమైపోతుంది. అలానే ఉంది కాంగ్రెస్, బి.జె.పి నాయకుల వ్యవహారం. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డె అక్రమ మైనింగ్‌లో సి.ఎం యెడ్యూరప్పకి పరోక్షంగా బాధ్యత ఉందని తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అది కాకుండా లోకాయుక్త తన ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపించాడు. రెండింటికి బాధ్యత వహిస్తూ యెడ్యూరప్ప రాజీనామా…