ర్రయ్… ర్రయ్… యు.పి.ఎ-2 పయనం ఎందాక? -కార్టూన్
చిన్న పిల్లలకి వాహనాలను స్వయంగా నడపాలన్న కోరిక బుర్రని తొలుస్తూ ఉంటుంది. కానీ పెద్దవారి భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. వాహనాలు ఉన్న ఇంట్లో అయితే స్టీరింగ్ ముందు కూర్చుని దాన్ని తిప్పుతూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుకుంటారు. వాహనాలు లేనివారయితే ఉత్త చేతుల్ని స్టీరింగ్ పట్టుకున్నట్లు గాలిలో ఉంచి స్టీరింగ్ ని తిప్పుతున్నట్లు చేతులు ఆడిస్తూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుతుంటారు. తాడు రెండు కొసల్ని ముడివేసి మధ్యలో నలుగురైదుగురు చేరి ‘బస్సమ్మ బస్సు…’ అంటూ…