చైనా కరెన్సీ యువాన్ విలువపై మాట మార్చిన అమెరికా ట్రెజరీ

చైనా తన కరెన్సీ యువాన్ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదంటూ గత రెండు, మూడు సంవత్సరాలనుండీ వాదిస్తూ వచ్చిన అమెరిక ట్రెజరీ డిపార్టుమెంటు ఇప్పుడు “అబ్బే, అదేం లేదు” అంటోంది. యువాన్ విలువ అమెరికా, చైనాల మధ్య ఒక వివాదాంశంగా చాలాకాలం నుండి ఉంది. ముఖ్యంగా గత రెండు, మూడు సంవత్సరాల నుండి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తినప్పటి నుండి యువాన్ విలువను తగ్గించాలని అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇండియా, జపాన్‌లు…