2 వారాల్లో 7800 కోట్లు పరారీ, అమెరికా మూసివేత ఫలితం

విదేశీ పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం పడని పాట్లే లేవు. ఎన్ని పాట్లు పడినా ఫలితాలు మాత్రం సరిగ్గా విరుద్ధంగా వస్తున్నాయి. దానికి కారణాలు భారత ప్రభుత్వం చేతుల్లో లేకపోవడమే అసలు సమస్య. అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ, అనగా రెండు వారాల్లో రు. 7,800 కోట్లు లేదా 1.2 బిలియన్ డాలర్లు దేశం నుండి పరారీ అయ్యాయి. ఈ పలాయనం అమెరికా ప్రభుత్వం మూసివేత ఫలితమేనని పి.టి.ఐ తెలిపింది. భారత ఋణ మార్కెట్ నుండే ఈ మొత్తం…

కరెంటు ఖాతా లోటు, రెవిన్యూ లోటు అంటే?

ప్రశ్న (చందు అరవింద్): … … మీ బ్లాగ్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. మీ విశ్లేషణలు చాలా అర్ధవంతంగా ఉంటాయి. మీరు ఇటీవల రేపో రేటు, సి.ఆర్.ఆర్ ని తెలుగులో సాధారణ వ్యక్తికి కూడా అర్ధం అయ్యే విధంగా వివరించారు. అలాగే CURRENT ACCOUNT DEFICIT, REVENUE DEFICIT, LIQUIDITY ADJUSTMENT FACILITY ల గురించి కూడా వివరించగలరని నా మనవి. నేను… … సమాధానం: అరవింద్ గారు మీ ప్రశ్నలో అవసరం…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…